భీమవరం :- పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో హేలాపురి న్యూస్ ప్రతినిధులకు ఎదురైన అవమానకర సంఘటనపై ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (AIWJA) మండిపడి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి అధికారికంగా ఫిర్యాదు పంపింది.
సంఘటన వివరాలు:
హేలాపురి న్యూస్ ప్రతినిధులు పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలో వేసిన నాన్ లేఔట్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌కు సంబంధించి ల్యాండ్ కన్వర్షన్ ఫీజు చెల్లించబడినట్లు లేదన్న ఆరోపణలపై సమాచారం సేకరించేందుకు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అయితే, కార్యాలయంలోకి ప్రవేశించే ముందు తాహసీల్దార్ ఎడ్ల దుర్గ కిషోర్ సూచనలతో అక్కడి ప్యూన్ జర్నలిస్టుల సెల్‌ఫోన్‌ను బలవంతంగా తీసుకుని బయట ఉంచి, తరువాతనే లోపలికి అనుమతించారు. కార్యాలయంలో, “అక్క్రిడిటేషన్ కార్డు లేనివారికి మేమెందుకు సమాచారం ఇవ్వాలి?” అంటూ తహసీల్దార్ వారిని అవమానిస్తూ, “నీవు ఫేక్ జర్నలిస్టు” అనే మాటలతో దూషించారు. పైగా ఈ అంశంపై వార్తలు రాస్తే క్రిమినల్ కేసులు వేస్తామని బెదిరించారు.
తహసీల్దార్‌పై ఫిర్యాదు పత్రాన్ని ఎస్పీ కి అందించిన హేలాపురి న్యూస్ సబ్ ఎడిటర్ కె. విజయ ప్రసాద్..
హేలాపురి న్యూస్ సబ్ ఎడిటర్ కె. విజయ ప్రసాద్ తన తోటి జర్నలిస్టులతో కలిసి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి తహసీల్దార్‌పై AIWJA ఫిర్యాదు లేఖను అందజేశారు. జర్నలిస్టులు ప్రభుత్వ అనుమతులతో నడిచే పత్రికలకు చెందిన వారు అయినప్పటికీ అక్రిడేషన్ కార్డు లేదని చెప్పి తహసీల్దార్ అవమానపరిచిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం తనకు తమ సిబ్బందికి వ్యక్తిగతంగా జరగిన సంఘటన మాత్రమే కాదని జిల్లాలో చాలా మంది విలేకరులు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, అక్రిడేషన్ పేరుతో ప్రభుత్వ అధికారులు జర్నలిస్టులను తక్కువచూపు చూస్తూ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నాయి అని ఎస్పీ కి ఆయన తెలిపారు.
లేఖలో AIWJA పేర్కొన్న ముఖ్యాంశాలు:
* జర్నలిస్టుల సెల్‌ఫోన్లను బలవంతంగా తీసుకోవడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘన.
* సమాచారం ఇవ్వకుండా నిరాకరించడం, బెదిరించడం వల్ల ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్ర్యం హరించబడింది.
* పై చర్యలు IPC సెక్షన్లు **341 (తప్పుడు నిర్బంధం), 352 (బలవంతంగా ఒత్తిడి), 503 (క్రిమినల్ బెదిరింపు)**లకు లోబడతాయి.
* ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం – 1978 ప్రకారం ఇది పత్రికా స్వేచ్ఛను హరిస్తుంది “అక్క్రిడిటేషన్ ఉన్నా లేకపోయినా, ప్రభుత్వ అనుమతులతో నడిచే ఆర్‌ఎన్‌ఐ నెంబర్ కలిగిన పత్రికల యాజమాన్యాల ద్వారా జారీచేసే ఐడి కార్డులు కూడా చట్టబద్ధమైన ప్రామాణిక గుర్తింపుగా పరిగణించాలి. మా సభ్యులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కాదు వారు చట్టబద్ధమైన పత్రికల ద్వారా పని చేస్తున్న వృత్తిపరులే.” అని AIWJA తమ లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఈ సంఘటనపై విచారణ జరిపి పత్రికా స్వేచ్ఛను విలేకరుల గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్న వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని లేని యెడల తాము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తో పాటు హ్యుమన్ రైట్స్ కి ఫిర్యాదు చేసి హై కోర్టు దృష్టికి ఈ సంఘటన తీసుకవెళ్తాం అని Aiwja జాతీయ సెక్రెటరీ ఎం.రాధా దేవి ఎస్.పి కి ఇచ్చిన లేఖలో పేర్కొంది.
పశ్చిమ గోదావరి ఎస్పీ స్పందన:
ఈ సంఘటనపై లేఖను స్వీకరించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇందుకు కారణం అయిన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా పత్రికా విలువలు విలేకరుల గౌరవాన్ని కాపాడుతాం అని విజయ ప్రసాద్ కి జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు.